
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- క్రికెట్ కు సంబంధించి ప్రతి ఒక్క అంశంలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో వివరిస్తూ రవిచంద్రన్ అశ్విన్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ 2025 సంవత్సరం ఇవాల్టితో ముగియనున్న సందర్భంగా ఈ ఏడాది తనకు నచ్చిన అలాగే అద్భుతమైన ప్రదర్శన ఘనపరిచిన టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు వీరే అంటూ అశ్విన్ కొంతమంది ప్లేయర్లను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపారు. 2025 సంవత్సరంలో నా దృష్టిలో కొంతమంది క్రికెట్ ప్లేయర్లు అత్యద్భుతంగా రాణించారు అని టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ పేర్కొన్నారు. అశ్విన్ తనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ.. వరుణ్ చక్రవర్తిని బౌలర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశారు.
Read also : టోల్ ప్లాజాల వద్ద రద్దీ అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు
అంతేకాకుండా ఈ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 2026 t20 వరల్డ్ కప్ లో కూడా కీలకపాత్ర పోషిస్తారు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బ్యాట్స్మెన్ పరంగా అభిషేక్ శర్మను ఈ 2025 ఏడాది లో అత్యుత్తమ బ్యాటర్ గా పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చెలరేగి ఆడేటువంటి అభిషేక్ శర్మను నెక్స్ట్ జనరేషన్ X ఫ్యాక్టరుగా అభివర్ణిస్తూనే ప్రశంసించారు. ఈ ఏడది ఎంతోమంది క్రికెట్ ప్లేయర్లు రాణించిన అశ్విన్ తన దృష్టిలో ఉన్నటువంటి ఈ ఇద్దరు ప్లేయర్లను టీమిండియా స్టార్ ప్లేయర్లుగా గుర్తించారు. అంతేకాకుండా వీరిద్దరూ భవిష్యత్తులో టీమిండియా జుట్టు తరఫున కీలకపాత్ర పోషిస్తారు అని అన్నారు. అయితే మరోవైపు దిగజా ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీలు వన్డే వరల్డ్ కప్ కోసం చాలా ఆసక్తికరంగా అలాగే తీవ్రంగా శ్రమిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. 2027 లో జరగబోయేటువంటి వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటినుంచే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ పలు మ్యాచ్లు ఆడడమే కాకుండా వారి సత్తా అలాగే ఫిట్నెస్ ఏంటో నిరూపించుకుంటూనే ఉన్నారు.
Read also : Viral Video: ఇంతకన్నా అందమైన దోపిడీని మీరు చూపెట్టగలరా..? చూస్తే మాత్రం నవ్వాపుకోవడం కష్టమే!





