Homeఆంధ్ర ప్రదేశ్స‌మ్మ‌ర్‌లో ఇవి స్పెష‌ల్‌....ఇవి తింటే శ‌రీరం ఐస్ కావాల్సిందే...!

స‌మ్మ‌ర్‌లో ఇవి స్పెష‌ల్‌….ఇవి తింటే శ‌రీరం ఐస్ కావాల్సిందే…!

మంచిర్యాల‌, క్రైమ్ మిర్ర‌ర్‌ :వేస‌విలో అరుదుగా ల‌భించే వాటిలో తాటి ముంజ‌లు ఒక‌టి. ఇవి స‌హ‌జ సిద్దంగా ఎలాంటి కెమిక‌ల్ లేకుండా శ‌రీరాన్ని చ‌లువాగా ఉంచుతుంది. అంతేగాకుండా ఎడ‌వేమిడి నుంచి సైతం ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తోంది. ఇవి తింటే శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. . పోషకాలతో కూడిన ఇవి మృదువుగా, తీపిగా ఉండి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి, మరియు లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. శరీరానికి చల్లదనం వేసవి తాపాన్ని తట్టుకోవడానికి, బాడీని కూల్ చేయడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి.

శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నం…జీర్ణ‌క్రియ మెరుగు…

:తాటి ముంజల్లో ఉండే ఫైబర్ మలబద్ధకం, ఎసిడిటీ మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో జీర్ణ‌క్రియ మెరుగుప‌ర‌డంలో సహాయపడుతుంది.ఇందులో ఉండే నీరు, ఖనిజ లవణాలు శరీరంలో నీటి శాతాన్ని పెంచి, డీహైడ్రేషన్‌ను నివారిస్తాయి. శీరానికి పోష‌కాలు అందించేదు ఏ, సీ,ఈ , పొటాషియం పుష్క‌లంగా ల‌బిస్తాయి.లివర్, కొలెస్ట్రాల్: లివర్ సంబంధిత సమస్యలను తగ్గించడంలో మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ఇవి సహాయపడతాయి.

విరివిగా వెలుస్తున్న తాటి ముంజ‌ల దుకాణాలు…

ఒక‌ప్పుడు ఈ తాటి ముంజ‌లు పల్లెల్లో వేస‌వి కాలంలో వ‌చ్చిందంటే కుటుంబంతో క‌లిసి వీటిని తినే వారు. ఇప్పుడుప‌ట్ట‌ణాల్లో సైతం ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్ద‌గా ల‌భిస్తున్నాయి. తాటి ముంజ‌లు వివిధ ధ‌ర‌ల్లో ల‌భిస్తున్నాయి. ఇవి వేసివిలో శ‌రీరాన్ని డిహైడ్రేష‌న్‌, శరీరానికి చ‌లువా అందిచ‌డంతో కొనుగోలు దారులు వీటిని తినిడ‌గానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇవి స‌హ‌జ‌సిద్దంగా ల‌భించ‌డంతో తాటిముంజ‌లు కొనుగోలు చేయ‌డంలో జ‌నాలు మ‌క్కువ చూపుతున్నారు. మారుతున్న జీవ‌న ప్ర‌మాణాల దృష్ట్యా తాటి ముంజ‌లు తిన‌డం మేలంటున్నారు మేధావులు. ఏదేమైన తాటి ముంజ‌ల విక్ర‌య‌దారులు సైతం నాలుగు పైస‌లు పోగేసుకుంటున్నారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments