
క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :-
ఆరు నెలలైనా సబ్జెక్టు లేదంటూ వేదిక పైనుంచే ఆర్డీఓ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నల్గొండ జిల్లా చందంపేట లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో జరిగింది.నల్గొండ జిల్లా చందంపేట మండలంలో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న పొగిల్ల, చిత్రియాల, చందంపేట, కాసరాజుపల్లి, కంభాలపల్లి ప్రజలు భూ సమస్యల పరిష్కారం కోసం చందంపేట తహసీల్దార్ ఆఫీస్, దేవరకొండ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా కనీసం అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి తన పక్కనే ఉన్న ఆర్డీఓ ను ప్రజలను ఎందుకు తిప్పించుకుంటున్నారని అంటూనే భూ సమస్యలు ఎలా పరిష్కరించాలో మీకు తెలియదా అని అంటూనే దేవరకొండ కు ఆర్డీఓ గా వచ్చి ఆరు నెలలైంది… కనీస సబ్జెక్టు లేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుండైనా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన సూచించారు.