
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై పరోక్షంగా మండిపడ్డారు. గత రెండు మూడు రోజుల క్రితం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగ డే రోజున 700 కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేశారు అని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ తీసుకున్న వాళ్ళని అధికారంలోకి వచ్చిన వెంటనే జైల్లో వేస్తామని హెచ్చరించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఋషికొండ కు గుండు కొట్టి ప్యాలెస్ కోసం 500 కోట్లు వృధాగా ఖర్చు చేసింది జగన్ కాదా అని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రతిరోజు యోగా చేయమని ఒక యోగ డే నిర్వహిస్తే దాన్ని విశ ప్రచారం చేస్తున్నారు అని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక PPP విధానంలో కాలేజీలు కడుతున్నాము అంటే జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇది జగన్ రాక్షసత్వానికి నిదర్శనమని తీవ్రంగా మండిపడ్డారు. జగన్ మాత్రమే కాదు ఎవరైనా సరే అభివృద్ధికి అడ్డుపడిన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని… రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు నాయుడు తెల్చి చెప్పారు.
Read also : మీకు యోగి ట్రీట్మెంట్ కరెక్ట్.. ప్రతిపక్షానికి పవన్ కళ్యాణ్ వార్నింగ్?
Read also : ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిది?





