
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ఇద్దరు ఎంగేజ్మెంట్ చేసుకున్న రెండు రోజులకే ఈ ఘటన జరగడం ప్రతి ఒక్కరిని కూడా షాక్ కు గురి చేసింది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు నమ్మకాలకు అలాగే శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఈ మూడు నమ్మకాలు అనేవి కొంతమంది పాటిస్తే మరికొందరు మాత్రం ఇది నేచురల్ గానే జరిగింది… దీనికి మూడు నమ్మకాలు అంట కడతామా అని వదిలేస్తూ ఉంటారు. కానీ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఈ కారు ప్రమాదానికి గల కారణం ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మికా వల్లనే అని చాలామంది నెటిజన్స్ కామెంట్లు చేయడం ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
రష్మిక ది ఐరన్ లెగ్ అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తుండడంతో ఇవన్నీ పసలేని వాదనలు అంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండకి ఎటువంటి గాయాలు కాకుండా ఈ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడడానికి కారణం రష్మిక మందన అని అనుకోవచ్చుగా?.. కాస్త పాజిటివ్గా ఆలోచించండి అని మరి కొంతమంది ఈ పసలేని కామెంట్లు చేస్తున్న వారికి కౌంటర్ రూపంలో రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రోడ్డు పాదం నుంచి ఎటువంటి గాయాలు కాకుండా అందరం క్షేమంగా ఉన్నామని విజయ్ దేవరకొండ కూడా ఈ ప్రమాదంపై స్పందించాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
Read also : తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి… ఇకపై అలా చేస్తే కఠిన చర్యలు!
Read also : ఆర్‌టీసీ చార్జీల పెంపుపై బిఆర్‌ఎస్ నేతల బస్సు నిరసన యాత్ర