జాతీయంవైరల్

సోషల్ మీడియాలో కొత్త నోట్ల నాణ్యత పై భారీ చర్చ! ఎందుకో తెలుసా?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- RBI తీసుకువచ్చినటువంటి కొత్త 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్ల నాణ్యత పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దగానే చర్చ జరుగుతుంది. గతంలో ఉన్న నోట్ల కన్న కొత్తగా వచ్చిన నోట్ల నాణ్యతలో చాలానే తేడా ఉంది అని సోషల్ మీడియా వేదికగా చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్.బి.ఐ తీసుకు వచ్చినటువంటి కొత్త నోట్లు వెంటనే పాడైపోతున్నాయని అంటున్నారు. పాత నోట్లతో పోలిస్తే ఈ కొత్త నోట్లు వెంటనే చిరిగిపోతున్నాయని కూడా చాలామంది అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నాణ్యత లోపం ఉండడం వల్లే ఈ నోట్లు చాలా తక్కువ సంవత్సరాలకు చిరిగిపోతున్నాయని అంటున్నారు. మరోవైపు కొత్తగా వచ్చిన నోట్లలో పసుపుగా ఉన్నటువంటి రంగు అనేది మెల్లిగా వెలసిపోవడం వంటివి జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు.

Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 రోజులు భారీ వర్షాలు

తాజాగా సోషల్ మీడియాలో గత కాలంలో ఉన్నటువంటి పాత 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లను.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 20 అలాగే 50 రూపాయల నోట్లను పక్క పక్కన పెట్టి పాత నోట్లకు అలాగే ఇప్పటినోట్లకు ఎంత తేడా ఉందో చూడండి అని సోషల్ మీడియా వేదికగా చాలానే ఫోటోలను అప్లోడ్ చేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న నోట్ల కన్న ఓల్డ్ మోడల్ నోట్లు ఇప్పటికీ కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అప్పటి నోట్లు రంగు పోకుండా, ముడతలు పడకుండా, వెంటనే చిరగకుండా ఉండేవి. కానీ ఇప్పటి నోట్లు మాత్రం వెంటనే రంగు పోవడం, ముడతలు పడిపోవడం, వెంటనే చిరిగిపోవడం కూడా జరుగుతుంది అని గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా సోషల్ మీడియాలో ఈ నోట్ల గురించి గత కొద్ది రోజుల నుంచి చాలానే చర్చ జరుగుతుంది. మరి వీటిపై అధికారులు ఎలా స్పందిస్తారు అనేది వేచి ఉండాల్సిందే!..

Read also : బంగారం స్మగ్లింగ్ కేసు, నటి రన్యాకు రూ.102 కోట్ల జరిమానా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button