
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025 లో భాగంగా నిన్న భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. అయితే మొదటి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్నిత 50 ఓవర్లకు 251 పరుగులు చేశారు. భారత మహిళల జట్టు తరుపున వికెట్ కీపర్ రిచాగోష్ 94 పరుగులతో రాణించి ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కించింది. మరోవైపు 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా మహిళల జట్టు ఒకానొక సమయంలో కచ్చితంగా ఓడిపోతుందని భారతీయులు చాలా ఆనందపడ్డారు. కానీ అంతలోనే ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన డి క్లర్క్ కేవలం 54 బంతుల్లోనే 84 పరుగులు చేసి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించింది. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికా ఘనవిజయం సాధించింది. దీంతో గెలుస్తుంది అని ధీమాతో నిద్రపోయిన ఇండియన్ ఫ్యాన్స్ ఉదయం లేచి రిజల్ట్ చూసేసరికి షాక్ అయ్యారు. దీంతో ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ మొదటి పరాజయాన్ని చవి చూసింది. దీంతో ఫ్యాన్స్ అందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఎక్కడ కూడా మ్యాచ్లను సింపులుగా తీసుకోవద్దు అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఒక ఓటమి ఎంతో మంది ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తుంది. కాబట్టి చాలా ధైర్యంగా, కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో మ్యాచును ఆడుతూ ఉండాలని ఫాన్స్ మన ఇండియా మహిళల క్రికెటర్లకు సూచనలు చేస్తున్నారు.
Read also : రాయలసీమలో దంచి కొడుతున్న భారీ వర్షాలు..!
Read also : తెలంగాణ లోకల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్