
ఇజ్రాయిల్ మరియు హమాస్ల మధ్య యుద్ధం అనేది తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయిల్ వరుస దాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని పాలస్తీనా పౌరులు భయంతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తాజాగా గాజా స్ట్రిప్ లోని పాలస్తీనియన్లు తలదాచుకుంటున్న నాలుగు పాఠశాలలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేయడంతో అక్కడికక్కడే 69 మంది పౌరులు మృతి చెందారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారిక వర్గాలు తెలిపారు.
రేపు మరో వాయుగుండం!… ఏపీలో నాన్ స్టాప్ వర్షాలే?
అయితే ఈ దాడిలో జర్నలిస్టులు మరియు పాలస్తీనా సివిల్ డిఫెన్స్ కు చెందిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారట. ఇజ్రాయిల్ చేసిన దాడి తీవ్రత వల్ల సిరియాలో సోమవారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా ప్రకంపనలకు గురైందట. ధూళి,దుమ్ముతో కొన్ని కిలోమీటర్ల మేరకు మేఘాలు కమ్మేసాయి . ఒక సమయంలో అక్కడ భూమి కూడా భారీగా కదిలినట్లు తెలిపారు. రెక్టార్స్ స్కేల్ పై 3.0 గా ప్రకంపనలు నమోదు అవ్వగా ఇది భూకంపం కంటే రెండు రెట్లు వేగంతో ప్రకంపనలు వచ్చినట్లుగా రీఛర్డ్ కోర్డారో ఓ ప్రకటనలో తాజాగా తెలిపారు. ఇక దాదాపుగా 2012వ సంవత్సరం నుంచి సిరియాపై ఇజ్రాయిల్ చేసిన అతి పెద్ద దాడి ఇదే అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచమంతా కూడా చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
పరామర్శ ఓకే!.. కానీ చావుతో పోరాడుతున్న పిల్లాడి పరిస్థితి ఏంటి?