
క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్:- ఈ మధ్యకాలంలో మహిళలపై వేధింపులు కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కొంతమంది అధికారులు తన అధికారాన్ని చలాయించి లంచాలు తీసుకోవడం లేదా బెదిరించడం లాంటివి చూస్తున్నాo. కానీ ఈ మధ్యకాలంలో అధికారులు కూడా కొన్ని నేరాలు చేస్తూ ఉన్నారు. తన అధికారాన్ని దుర్వినియోగాలకు వినియోగిస్తూ ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మహారాష్ట్రలోని సతారాలో ఒక ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. ఒక ఎస్సై నన్ను రేప్ చేశాడంటూ ఆ మహిళ చేతిపై రాసుకున్న సూసైడ్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
Read also : కర్నూలు బస్సు ప్రమాదం ఎఫెక్ట్.. యజమానులకు హెచ్చరికలు చేసిన పొన్నం
ఇక అసలు వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని సతారా లో ఒక మహిళా ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తుంది. అయితే వేణుగోపాల్ అనే ఎస్సై గత ఐదు నెలల నుంచి ఇప్పటికే నన్ను నాలుగు సార్లు రేప్ చేశాడు అంటూ ఆమె చనిపోయే ముందు చేతి పై రాసుకొని మరణించింది. ఫిజికల్ గా, మెంటల్ గా గత ఐదు నెలల నుంచి దారుణంగా వేధిస్తున్నాడు. గోపాల్ తో పాటు మరొక పోలీస్ వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం DSP కీ లేక రాసిన కూడా పట్టించుకోలేదని రాసి ఉంది. అందుకే వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆమె చేతిపై పెన్నుతో రాసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనను చూస్తున్నటువంటి ప్రేక్షకులు.. ఎస్సై ని దారుణంగా ఎన్కౌంటర్ చేసేయాలని… అలాంటప్పుడు ఈ మహిళలపై వేధింపులు ఆగిపోతాయని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు అధికారులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా మాలాంటి సామాన్య ప్రజలను కాపాడేది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.
Read also : దాడుల ఎఫెక్ట్.. పాకిస్తాన్ లో ఆకాశాన్ని అంటుతున్న ధరలు..?





