జాతీయంవైరల్

దేశమంతా “ZOHO” పిలుపే… అట్లుంటది ప్రధాని మోదీతో..!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ వస్తువులు అలాగే స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎప్పుడైతే పిలుపు ఇచ్చారో.. అప్పటినుంచి దేశమంతా కూడా స్వదేశీ వాటిపైనే దృష్టి సారించాయి. చిన్న చిన్న వస్తువులను మొదలుకొని పెద్ద పెద్ద ప్రోడక్ట్ల వరకు అన్నీ కూడా స్వదేశీ వాటిని కొనుగోలు చేయడానికి,సృష్టించడానికి మన భారతీయులు సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా విదేశీ యాప్స్ అయినటువంటి వాట్సాప్ అలాగే మెయిల్ వంటివి కొన్ని స్వదేశంలో క్రియేట్ చేసిన వాటిని ఉపయోగించాలని మోడీ పిలుపు ఇవ్వడంతో వెంటనే జోహో అనేది దేశవ్యాప్తంగా మారు మ్రోగుతుంది. ప్రస్తుతం జోహో మెయిల్, ARATTAI అనే మెసేజింగ్ యాప్ ను ఉపయోగించడానికి భారతీయులు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ వింబు అనే వ్యక్తి స్థాపించిన ఈ సంస్థలకు కొన్నేలుగా గడ్డుకాలాలు ఎదురయ్యాయి. కానీ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ అనే పిలుపు ద్వారా కొద్ది రోజుల్లోనే ఇతని జోహో మెయిల్ కు అదృష్టం కలిసి వచ్చింది. కేంద్ర మంత్రి తో పాటుగా నేడు హోం మంత్రి అమిత్ షా కూడా జోహో మెయిల్ ను క్రియేట్ చేసుకున్నారు. వీటన్నిటికీ స్వయంగా కేంద్రమే పబ్లిసిటీ ఇవ్వడంతో ఈ యాప్స్ కు భారీగా యూజర్ల సంఖ్య పెరిగిపోతుంది. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడైతే అన్నిటిపై టారీఫ్స్ విధించారో… దీనిని ప్రధానమంత్రి మోడీ సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఇప్పటినుంచి అన్నీ కూడా స్వదేశంలోనే తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండియాలో మొన్నటివరకు విదేశీ వస్తువులు అలాగే ప్రోడక్ట్లు పెద్ద ఎత్తున సేల్స్ అయ్యేవి. కానీ మోడీ స్వదేశీ పిలుపుతో విదేశీ వస్తువులన్నిటికీ కూడా భారీగా సేల్స్ తగ్గిపోయాయి.

Read also : ఉత్కంఠంగా మారిన జగన్ పర్యటన.. మరో కరూర్ ఘటన అవ్వబోతుందా?

Read also : మైనర్ బాలిక హత్య కేసు – దూకుడు పెంచిన డీఎస్పీ శివరాం రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button