
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తమిళ స్టార్ హీరో ధనుష్ తన వ్యక్తిగత విషయాల గురించి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాకు లగ్జరీ వాచ్ లను కలెక్ట్ చేయడం.. వాటిని ధరించడం నా అలవాటు అని తమిళ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈమధ్య జరిగినటువంటి ఒక ప్రైవేటు ఈవెంట్లో హీరో ధనుష్ ధరించిన వాచ్ గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించడంతో తను ధరించే అన్ని లగ్జరీ వాచ్ ల గురించి వివరించారు. ఇప్పటివరకు నా దగ్గర కొన్ని పదుల సంఖ్యలో లగ్జరీ వాచ్ లు ఉన్నాయి. వాటి ధర కూడా 50 కోట్ల నుంచి 70 కోట్లు వరకు ఉంటుంది అని చెప్పాడు. చిన్నప్పటినుంచి విలువైన గడియారాలు ఎన్ని ఉన్నా కూడా స్కూల్లో నాకు నా తల్లి కొనించినటువంటి వంద రూపాయల ప్లాస్టిక్ వాచ్ ను ఇప్పటికీ కూడా చాలా భద్రంగా ఉంచుకుంటున్నాను అని ఈ హీరో ధనుష్ వ్యాఖ్యానించారు. దీంతో ఎంత లగ్జరీ వాచ్లు ఉన్నప్పటికీ తన తల్లి ఇచ్చినటువంటి వాచ్ ను ఇప్పటికీ భద్రంగా దాచుకున్న ధనుష్ కు సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ మధ్య ఈ తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతున్నాయి. ప్రతి సినిమా కూడా హిట్ గానే నిలుస్తూ వస్తుంది.
Read also : 48 గంటల్లో మరో తుఫాన్.. ఐదు రోజులపాటు భారీ వర్షాలు!
Read also : ప్రతి NTR అభిమానికి క్షమాపణలు.. అలా అనకుండా ఉండాల్సింది!





