Saturday, March 7, 2026
Homeఅంతర్జాతీయంఅమెరికా చిచ్చుతో ర‌గులుతున్న యుద్దం

అమెరికా చిచ్చుతో ర‌గులుతున్న యుద్దం

  • క‌ల‌వ‌రానికి గుర‌వ‌తున్న ప్ర‌పంచ దేశాలు

  • తాజాగా 14 దేశాల‌కు పాకిన యుద్దం

న్యూయార్క్, క్రైమ్ మిర్ర‌ర్:మిడిల్‌ ఈస్ట్‌లో అమెరికా పెట్టిన చిచ్చు క్రమంగా రగులుతోంది. మొదట ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్‌ దాడులతో యుద్ధమ మొదలైంది. తొలిరోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీని అమెరికా మట్టుబెట్టడంతో ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది. అయితే ఈ దాడులు ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా బేస్‌లు ఉన్న గల్ఫ్‌ దేశాలపై వైమానికి దాడులు చేసింది. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, ఓమన్, టర్కీ తదితర దేశాలపై ఇరాన్‌ మిస్సైల్‌ దాడులు చేస్తోంది. యుద్ధం ప్రారంభించి ఏడు రోజులైంది.

మూడు దేశాలతో మొదలైన యుద్ధం ఇప్పుడు 14 దేశాలకు విస్తరించింది. ఇప్పుడు ఇరాక్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమాన్, సౌదీ అరేబియా, లెబనాన్, సైప్రస్‌ వంటి 14 దేశాలను యుద్ధం చుట్టుముట్టింది.చర్చలు లేకపోవడంతో యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలాగా ఈ ఘర్షణ కూడా సంవత్సరాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్‌ యుద్ధం విస్తరించేందుకు అమెరికా అనుకూల దేశాలపై దాడులు చేస్తుంది.

మరోవైపు అమెరికా–ఇజ్రాయెల్‌ ఇరాన్‌ను వీలైనంత త్వరగా కట్టడికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌కు ప్రాక్సీ దళాలు (హిజ్బుల్లా, హౌతీలు) దీర్ఘకాల పోరాటానికి అనుకూలం. అమెరికా, ఇజ్రాయెల్‌ ఆధునిక ఆయుధాలతో పైచేయి సాధిస్తున్నా, ప్రాంతీయ మద్దతు బలహీనత కలిగిస్తోంది. చైనా కూడా ఇరాన్‌ సార్వభౌమాధికారం కాపాడతామని ప్రకటించింది. దీంతో చైనా కూడా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా, వాణిజ్య భాగస్వామి చైనా రంగంలోకి దిగితే పరిస్థితి ప్రపంచ యుద్ధ స్థాయికి చేరుకుంటుంది.

రష్యా డ్రోన్‌లు, మిస్సైల్‌ సాంకేతికత ఇచ్చి ఉక్రెయిన్‌ మోడల్‌ను పునరావృతం చేయవచ్చు. చైనా ఆర్థిక ఒత్తిడి, ఓసియాన్‌ మార్గాల్లో జోక్యం చేస్తే అమెరికా శక్తి విభజన అవుతుంది. ఇది నాటో, అరబ్‌ మిత్రుల మధ్య వైరుధ్యాలను పెంచుతుంది.తక్షణ శాంతి ఒప్పందాలు లేకపోతే యుద్ధం రెండేళ్లు కొనసాగవచ్చు. ఐరోపా, ఐక్యరాష్ట్ర సమితి మధ్యవర్తిత్వం జరిగితే మాత్రమే మొదటి దశలో ఆగిపోతుంది. ఆర్థిక సంక్షోభాలు, ఆంతరిక అశాంతి ద్వారా కూడా యుద్ధం ఆగే అవకాశం ఉంది. అయితే, ప్రాంతీయ అస్థిరత భవిష్యత్‌ దశాబ్దాల్లో కొనసాగుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments