హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ :రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ ఎస్ పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కేవలం ప్రత్యర్థులతో మాత్రమే కాదు ఇంటి పార్టీతోనే ప్రమాదం పొంచి ఉంటుంది. దీనిని బట్టి చూస్తే రాష్ర్టంలో బీఆర్ ఎస్ పార్టీకి అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు. మరో వైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడ మేమే గెలుస్తామనే ధీమాతో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.
బీజేపీని తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ప్రతి రాష్ట్రంలో వరసగా అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్నకమలం పార్టీ ఈసారి కారు పార్టీకి గట్టి ఛాలెంజ్ ను ఎదుర్కొనాల్సి ఉంటుంది.ఇక కల్వకుంట్ల కుటుంబం నుంచి కవిత బయటకు వచ్చేశారు. వచ్చే నెల 25వ తేదీన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లు కవిత తెలిపారు. దీంతో ఆమె కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలనుకూడా లక్ష్యంగా చేసుకుంటుంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఇప్పటికే అధికారంలో ఉండటంతో ఆ రెండు పార్టీలపై విమర్శలను ఒకవైపు చేస్తూనే, తాను తెలిసిన, తాను ఎరిగిన బీఆర్ఎస్ పాలనలో అవినీతిని కవిత ఎన్నికల వేళ బయటపెట్టే అవకాశాలున్నాయి. మిగిలిన పార్టీల విమర్శల కంటే కవిత చేసే విమర్శలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టనున్నాయి.పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి ఇప్పటి వరకూ రాలేదు.
ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించింది లేదు. ఆయన ఫామ్ హౌస్ దాటి బయటకు రావడం లేదు. గతంలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా ఉన్న ఇమేజ్ వచ్చే ఎన్నికలకు ఉండదనేది విశ్లేషకుల అంచనా. ఈ సారి ఎన్నికల్లో అనేక కారణాలు ఓటర్లపై ప్రభావం చూపుతాయి. సంక్షేమ పథకాలు ఎప్పుడూ మొదటి స్థానంలోనే నిలిచినా, అభివృద్ధితో పాటు అధికార పార్టీపై సహజంగా వెలువడే వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ఖచ్చితంగా కేసీఆర్ యాక్టివ్ కావాల్సిందేనన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
మరి కేసీఆర్ ఎన్నికల సమయానికి జనం ముందుకు వస్తే అది పెద్దగా సత్ఫలితాలనివ్వకపోవచ్చు. ఏదేమైన మళ్లీ అధికారంలోకి బీఆర్ ఎస్ రావాలంటే తన తన పంతాను రాజకీయ ఎత్తుగడులతో రావాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
