
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- పవర్ స్టార్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై విసనాతన ధర్మభావాలను ఎవరైనా సరే ఎగతాళి చేస్తే.. ఊరుకునే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. మన భారతదేశవ్యాప్తంగా 90 శాతం మంది హిందువులు ఉన్నారు. వారందరూ కూడా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్న సందర్భంలో చాలామంది ఈ ధర్మాలను వ్యతిరేకిస్తున్నారు అంటూ మండిపడ్డారు. సనాతం ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also : పహల్గాం దాడి తరువాత.. మళ్లీ ఇన్నాళ్లకు నరేంద్ర మోడీ హెచ్చరిక.. ఇక వారి గతి అంతే!
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది హిందువులు తిరుమల తిరుపతి దేవస్థానంలోని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తున్నారు. అలాంటి పుణ్యక్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం మన కోటి జన్మల పుణ్యము అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల అనేది ఒక పుణ్యక్షేత్రమే కాకుండా ప్రతి ఒక్క హిందువు ఆధ్యాత్మిక కేంద్రం అని అన్నారు. అలాంటి తిరుమల క్షేత్రంలో లడ్డు కల్తీ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తున్న సందర్భంలో ఇలాంటి కల్తీ ఘటనలు జరగడం వల్ల వారి మనోభావాలు దెబ్బ తింటాయని అన్నారు. విశ్వాసం అలాగే సనాతన ధర్మభావాలను ఎవరైనా సరే ఇప్పటి నుంచి ఎగతాళి చేస్తే అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయా ధర్మాలకు గౌరవం ఇవ్వాలని ట్వీట్ చేశారు.
Read also : వేములపల్లి లో దారుణం… కారు ఢీకొని ఓ వృద్ధుడు మృతి





