
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్ద చెరువు కట్టకు భారీ ఎత్తున గండి పడుతుంది.గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చెరువు కట్ట పైన ఉన్న నీరు చెరువులోకి వెళ్ళకపోవడంతో చెరువు కట్ట కిందికి వరదలా రావడంతో.. కట్టకు గండి పడటం మొదలైంది. తక్షణమే ఇరిగేషన్ అధికారులు తగినచర్యలు తీసుకొని కట్టకు వెంటనే మరమత్తులు చేపట్టాలని రావిర్యాల గ్రామ ప్రజలు కోరుతున్నారు.అదేవిధంగా ఈ రోజు కట్ట మైసమ్మ , పోచమ్మ బోనాలు కావడంతో కట్ట మార్గాన దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు.చెరువు కట్టపైన కట్టపైన భారీగా నీళ్లు నిలవడంతో రోడ్డు బురదల మారి కట్టమైసమ్మ గుడికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.వెంటనే సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో చెరువు కట్ట పూర్తిగా దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది.
Read also : ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాలేదా?.. హౌసింగ్ కార్పొరేషన్ కీలక సూచన!
Read also : తెలంగాణ బీజేపీలో సైంధవులు..!