ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణ సీఎంలకు తెలుగు జాతి సలాం కొట్టాల్సిందే!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎన్నో విధాలుగా ప్రతిరోజు బిజీ షెడ్యూల్లో గడపాల్సి వస్తుంది. ఒక ముఖ్యమంత్రికి ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునేంతవరకు కూడా నిత్యం ఏదో ఒక పనిమీద పోరాడుతూనే ఉండాలి. ఒక రోజులు అత్యధిక గంటలు బిజీగా గడిపే పొలిటికల్ లీడర్స్ లో ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. నిత్యం ఒత్తిడితో కూడుకున్న రాజకీయ రంగంలో మీ అందరితో పరిచయాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాలుగా భేటీలు కూడా అవ్వాల్సి ఉంటుంది. పొలిటికల్ రంగంలో ఉండి కూడా ఎటువంటి మచ్చలేని శ్రీ రామచంద్రులుగా ప్రస్తుత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటివరకు వీరిద్దరికీ కూడా సిగరెట్టు మరియు మద్యపానం అనేది ముట్టుకోలేదట. వీళ్ళిద్దరి చేతిలో ఒక్కసారైనా మద్యం బాటిల్ చూడలేదని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్న విషయం. ఇక డ్రగ్స్ విషయానికి వస్తే వీరిద్దరి దగ్గర ఆ ఊసే లేదని అంటున్నారు.

ఇక తాజాగా బిజెపి ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు చెడు లక్షణాలు కానీ చెడు అలవాట్లు కానీ సీఎం రేవంత్ రెడ్డి లో చూడలేదని ఆయన అన్నారు. అలాగే రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆడడం అంటే కూడా చాలా ఇష్టమని.. ఒక క్రీడాకారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పారు. తెలంగాణ యువత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి అని అన్నారు.

అయితే ప్రస్తుత సొసైటీలో యువత చాలా మంది డ్రగ్స్ కు అలవాటు పడిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి తరుణంలో ఎటువంటి అలవాటు లేని రేవంత్ రెడ్డి లాంటి వారు ప్రచారం చేస్తేనే దానికి ఒక విలువ ఉంటుందని అంటున్నారు. ఒక సామెత ప్రకారం మనం పాటించి ఎదుటివారికి చెప్పాలని అంటుంటారు. సక్రమంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మాత్రమే అర్హత ఉంటుందని పదిమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఏ చెడు అలవాటు లేని వారుగా ఆంధ్ర ముఖ్యమంత్రి మరి తెలంగాణ ముఖ్యమంత్రి ఉండడం చాలా మంది అదృష్టం. కాబట్టి ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే యువత చెడు అలవాటులకు అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయడం అంత కష్టమైన పని ఏం కాదు. కాబట్టి ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు యువతకు మద్యం అలాగే డ్రగ్స్ విషయంలో దూరంగా ఉండాలని సందేశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. కాబట్టి యువత ప్రస్తుతం ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా పరిచయం… మహిళా దారుణ హత్య? ఎక్కడంటే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button