తెలంగాణ

అధికారులపై దాడి గుండాల కుట్ర..దాడి ఘటనలో నిఘా విభాగాలు విఫలం.!

లగచర్లలో ఫార్మా కంపెనీ భూ అభిప్రాయ సేకరణ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా, పోలీసు అధికారులపై దాడులు చేయడం వెనక రాజకీయ హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం

  • దాడుల్లో మా పార్టీ వాళ్లు ఉన్న వదలొద్దు…
  • లగచర్ల వివాదంపై చేవేళ్ల ఎంపీ కొండా సంచలన వాఖ్యలు

క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఫార్మా విలేజ్ కంపెనీ వివాదంలో రాజకీయ నేతల హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని లగచర్లలో ఫార్మా కంపెనీ భూ అభిప్రాయ సేకరణ విషయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా, పోలీసు అధికారులపై జరిగిన దాడిపై స్పందించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వినతిపత్రాలు అందించాలని, దర్నాలు చేయాలి తప్పా దాడులకు దిగడం పద్దతి కాదని ఖండించారు.

అధికారుల పనితీరుతోనే నాయకులకు, ప్రభుత్వాలకు మంచి పేరు వస్తుందన్నారు. అలాంటి వారిపై దాడులు చేయడం వెనక రాజకీయ హస్తం, గుండాల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఘటనలో ఏ రాజకీయ పార్టీ నాయకులు ఉన్నా, ఆఖరుకు మా పార్టీ నేతలు ఉన్నా కూడా వదిలొద్దని అన్నారు. అదేవిధంగా దాడి ఘటనపై నిఘా విభాగాలు వైఫల్యం చెందాయన్నారు.నిజంగా వివాదం ఉంటే విచారణ జరపాలని అన్నారు. వివాదాన్ని ప్రోత్సహించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button