Sunday, February 22, 2026
Homeజాతీయంమహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట!.. స్పందిస్తున్న అధికారులు?

మహా కుంభమేళాలో భారీ తొక్కిసలాట!.. స్పందిస్తున్న అధికారులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ లో ఘనంగా జరుగుతున్నటువంటి మహాకుంభమేళా లో తాజాగా అపశృతి చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి దాదాపు రెండు గంటల సమయంలో మహా కుంభమేళాలోని త్రివేణి సంగమం వద్ద ఓ ఘాట్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికీ 17 మంది మరణించారని చాలామంది వరకు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. ఒకవైపు ప్రపంచ నలుమూలల నుండి ప్రతిరోజు కూడా కొన్ని లక్షలలో భక్తులు ఈ మహా కుంభమేళాకు వచ్చి
పుణ్యస్నాలను ఆచరిస్తున్నారు.

సీపీఎం పార్టీలో సంచలనం.. తొలిసారి కార్యదర్శిగా దళితుడు

అయితే తాజాగా ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మహా కుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసులాట ఘటన గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో ఫోన్లో ఘటన గురించి ఆరా తీశారు. ప్రభుత్వం నుండి గాయపడిన వారికి అలాగే మరణించిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇకనుండి మళ్లీ భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగిని కోరారు. కాగా నిత్యం ప్రతిరోజు కొన్ని కోట్ల మంది భక్తులు ఈ మహా కుంభమేళాకు ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఈ తరహా లోనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు హామీ ఇచ్చారు. కాగా ఈ మహా కుంభమేళా దాదాపుగా 45 రోజులు పాటు జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం 40 కోట్ల వరకు వస్తారని అంచనా వేయగా ప్రారంభమైన రెండు వారాలకి ఏకంగా 15 కోట్ల మంది భక్తులు ఈ మహా కుంభమేళాలో పుణ్యా స్నానాలను ఆచరించారు.

దావోస్ లో జోరుగా సెక్స్ పార్టీలు.. ఆ ఐదు రోజులే అదే పని..

విచ్చల విడిగా నల్లమట్టి దందా..!? రైతుల పేరిట అనుమతులు లక్షల సొమ్ము మూట..!?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments