
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు జోర్డాన్, ఇథియోపియా మరియు ఓమన్ వంటి దేశాలకు బయలుదేరనున్నారు. ఈనెల 18వ తేదీ వరకు కూడా ఈ మూడు దేశాల్లో నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. కానీ నేడు తీవ్రమైన పొగ మంచు ప్రభావం ప్రధాని నరేంద్ర మోడీ టూర్ పై ఎఫెక్ట్ చూపింది. ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్టును పూర్తిగా పొగ మంచు దట్టంగా కమ్మేయడంతో మోడీ ప్రయాణం కాస్త ఆలస్యమైంది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉండగా పొగ మంచు కారణంగా కాస్త ఆలస్యంగా బయలుదేరనున్నారు.
Read also : మాట ఇచ్చిన… నిలబెట్టుకుంటా..!
కాగా గత కొద్ది రోజుల నుంచి మన ఉత్తర భారత దేశంలో ఈ దట్టమైన పొగ మంచు కారణంగా ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ఇప్పటికే పంజాబ్ లోని మోగాలో కార్ కెనాల్ లోకి దూసుకెళ్లిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా ఇద్దరు టీచర్ దంపతులు మృతి చెందారు. ఇక హర్యానాలో కూడా హైవేపై 40 కి పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటనలు ఎంతో మంది డ్రైవర్లు అలాగే ప్రయాణికులు గాయపడ్డారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత రెండు రోజులు క్రితం ఒక బస్సు బోల్తా పడటంతో దాదాపు చాలా మంది చనిపోయారు. ఈ నేపథ్యంలోనే విమాన సర్వీసులపై కూడా ఈ పొగ మంచు ప్రభావం పూర్తిగా పడింది. కాబట్టి పొగ మంచు ఉన్న సమయాల్లో ప్రయాణికులు కాస్త జాగ్రత్తగా వాహనాలను నడపాలి అని అధికారులు సూచించారు. ఎంతమంది సెలబ్రిటీలు సైతం ఈ పొగ మంచు కారణంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం జరుగుతుంది.
Read also : TV Price Hike: వెంటనే టీవీలు కొనేయండి, లేదంటే జేబుకు చిల్లు పడటం ఖాయం!





