
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా గతంలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన గురించి మరోసారి ప్రస్తావించారు. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 35 కోట్ల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించునున్న దీక్ష విరమణ మండపం అలాగే సత్రంకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 హుస్నాబాద్ రోడ్ షోలో పాల్గొన్న నాకు కరెంట్ షాక్ తగిలింది. ఆ సమయంలో నాకు ఏమీ అర్థం కాలేదు.. అసలు ఆరోజు బతుకుతానో లేదో అనేది కూడా అర్థం కాలేదు అని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ కూడా ఆ కరెంట్ షాక్ నుంచి ఎలా బయటపడ్డానో నాకు అర్థం కాని పరిస్థితి, ఒక ఇంత ఆశ్చర్యంగానూ ఉంది అని అన్నారు.
Read also : బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్.. అఖండ -2 ఓటీటీ ఆ తేదీనే?
కొండగట్టు ఆంజనేయ స్వామినే నాకు పునర్జన్మ ఇచ్చారు అని.. సాక్షాత్తు ఆయనే నన్ను కాపాడారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎప్పటినుంచో కొండగట్టు ఆంజనేయ స్వామి పై నాకు అపారమైనటువంటి భక్తి ఉంది అంటూనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది అని దానికి సర్వశక్తుల నేను కృషి చేస్తాను అని అన్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయేటువంటి కొండగట్టులో గిరి ప్రదక్షణకు తన వంతు సహాయం అందజేస్తాను అని స్పష్టం చేశారు. ఎప్పుడు ఈ గుడికి సంబంధించి సహాయం కావాలన్న దానికి నేను ముందుంటానని అనానరు.
Read also : ఈ ఏడాది వరల్డ్ కప్ మ్యాచ్ ల తో ఫ్యాన్స్ కు పండుగే?





