
క్రైమ్ మిర్రర్, పిఠాపురం :-పిఠాపురంలో పొలిటికల్ గేమ్ మారబోతోందా…? నియోజకవర్గంపై పట్టు తప్పుతోందని పవన్ భావిస్తున్నారా…? పట్టు తప్పేలోపు పట్టుబిగించాలని వ్యూహరచన చేస్తున్నారా..? పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జనసేనాని.. ప్రక్షాళనకు సిద్ధమయ్యారా…? మరి పవన్ స్ట్రాటజీ పిఠాపురంలో వర్కౌట్ అవుతుందా…?
పిఠాపురం… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. అక్కడ ఎన్నికల వరకు ఓ లెక్క.. ఎన్నికల తర్వాత మరో లెక్క.. అన్నట్టు పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎన్నికల వరకు కలిసి పనిచేసిన టీడీపీ, జనసేన.. ఆ తర్వాత నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. గెలిచింది పవనే అయినా.. అక్కడ వర్క మార్క్ రాజకీయం కూడా నడుస్తోంది. దీనికి తోడు.. జనసేనలోనూ వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి.. అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకోమని పవన్ కళ్యాణ్ పార్టీ నేతకు బాధ్యతలు అప్పగిస్తే.. కంచే చేను మేనినట్టు అతనే అవినీతికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలు, ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. నియోజకవర్గంపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. పార్టీలో ప్రక్షాళన జరగకపోతే… పరిస్థితి చేయి దాటిపోతుందని భావించి యాక్షన్‌లోకి దిగుతున్నారు.
Read also : రష్యాతో భారత్ మరో మెగా డీల్.. మరిన్ని ఎస్-400 కోసం చర్చలు!
విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం నిర్వహించిన తర్వాత రోజు… పిఠాపురంలో నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన జనసేన ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. ఆ సమావేశంలో చాలా మంది… పార్టీ నేత మర్రెడ్డి శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేశారు. మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి… నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించారు పవన్ కళ్యాణ్. అయితే.. మర్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి లైన్ క్రాస్ చేశారు. ఆయన సొంతవర్గం ఏర్పాటు చేసుకుని… వారికే పనులు చేస్తున్నారట. ప్రతి పనిలోనూ తలదూరుస్తూ… అన్నింటినీ కమర్షియల్‌గా మార్చేస్తున్నారట. అంతేకాదు.. కాంట్రాక్టులు, ఉద్యోగుల బదిలీ వ్యవహారాల్లోనే కమిషన్లు దండుకున్నట్టు సమాచారం. ఇక… మట్టి, ఇసుక అక్రమ రవాణా అయితే.. జోరుగా సాగిస్తున్నారట. ఇంతకుముందు డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పుకునే వారు.. ఇప్పుడు మర్రెడ్డి తాలూకా అని చెప్పుకుంటున్నారట. ఇవన్నీ… పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో.. ఆయన సీరియస్ అయ్యారని సమచారం. పార్టీ ప్రక్షాళన కోసం.. కమిటీని కూడా నియమించారు. నియజోకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించారట. ఆ నివేదిక ఆధారంగా… పిఠాపురం జనసేనలో ప్రక్షాళన చేయబోతున్నారని సమాచారం.
Read also : విజయవాడ నడిరోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టుకున్న ఇద్దరు కానిస్టేబుళ్లు!