తెలంగాణ

కేటీఆర్ కారులో పోలీసులే డ్రగ్స్ పెట్టి బుక్ చేయాలని ప్లాన్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి తెలంగాణను ఎటు తీసుకువెళ్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డి తనని ట్రాప్ చేసే ప్రయత్నం చేశారని.. డ్రగ్స్ లో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను ప్రయివేటు ఫంక్షన్ కి వెళ్తే అక్కడికి డీఎస్పీలు,సిఐలు,కానిస్టేబుల్స్ వచ్చారు.. అక్కడ డ్రగ్స్ పెట్టి కేసు నమోదు చేయాలని ట్రై చేశారని కౌశిక్ రెడ్డి చెప్పారు.

రాజ్ పాకాల ఇంట్లో అదే జరిగిందని.. అక్కడికి కేటీఆర్ వస్తే డ్రగ్స్ పెట్టి కేటీఆర్ ను ఇరికించాలని చూశారని కౌశిక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.తన కారు చెకింగ్ చేస్తామని అంటే చెక్ చేసుకోమని చెప్పానని..కౌశిక్ రెడ్డి మందు తాగడనే విషయం వాళ్లకు తెలియదన్నారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇరికించకుండా ఎందుకు వదిలేశారని సీఎం ఇంటిలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని తిట్టారని తెలిపారు కౌశిక్ రెడ్డి. మాకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చి
కౌశిక్ రెడ్డి కారులో పెట్టాలని చెప్పారని పోలీసులే తనతో చెప్పారని కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.. నా ఇంటి చుట్టూ రోజు ఇంటిలిజెన్స్ వాళ్ళను పెడుతున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నామని చెప్పారు.ఛాలెంజ్ కు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు.. ఎక్కడికి రావాలో చెప్పు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఎంపీలు రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారా లేదా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారో తేలాలని కౌశిక్ రెడ్డి అన్నారు.

రేవ్ పార్టీలో ముసలివాళ్ళు,చిన్న పిల్లలు ఉంటారా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. షబ్బీర్ అలీ చేసే రేవ్ పార్టీలు అందరికి తెలుసన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేస్తారో నాకు తెలియదా..? రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్,దుబాయిలో ఏం చేశారో చెప్తే ఇంటికి వెళ్ళలేవని హెచ్చరించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా,రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వాయిస్ ను మార్ఫ్ చేసి వీడియోలు,ఆడియోల ద్వారా దుష్ప్రచారం చేయాలని చూస్తున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. పోలీసులు ధర్నాలు చేయడం చరిత్రలో చూడలేదన్నారు. ఏక్ పోలీస్ అని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో పొంకనాలు కొట్టారని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button