
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందా లేదా అని చాలామంది లోనూ ఒక సందేహమైతే ఉంటుంది. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్ కావాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి జైలు కు పంపించి ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టారు అని కూటమి కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత మెల్లిగా బెయిల్ ద్వారా బయటికి రావడం.. పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి ప్రచారాలు చేసి… ప్రజల మనసును దోచుకుని ఘన విజయం సాధించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే తాజాగా జగన్ ను అరెస్ట్ చేస్తారా అని ఒక ఇంటర్వ్యూలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ను ప్రశ్నించగా… మంత్రి చెప్పిన సమాధానం హైలెట్ గా నిలిచింది.
Read also : అలాంటోళ్లు మళ్లీ వస్తున్నారంటే… RO-KO 3.0 రీలోడెడ్..!
సొంత ఖజానా నింపుకోవడం కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వారంతా శిక్షకు అర్హులే అని మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందా అని?.. యాంకర్ ప్రశ్నించగా దానికి మంత్రి సత్య కుమార్ యాదవ్ సమాధానం ఇస్తూ…’ ప్రస్తుతం పాత్రధారులు అరెస్ట్ అవుతున్నారు.. త్వరలోనే సూత్రధారుల దగ్గరకి కూడా వెళ్లాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు. అన్నిటికీ ఆధారాలు ముఖ్యం. అవన్నీ సేకరించిన తర్వాత మీ మాట నిజం కావచ్చు ఏమో… అవన్నీ తొందరలోనే జరుగుతాయి లే అని మంత్రి సత్య కుమార్ యాదవ్ జగన్ అరెస్టు విషయంపై ఒక సమాధానం అయితే ఇచ్చారు. దీంతో ఆధారాలు దొరికితే జగన్ అరెస్ట్ కాయమే అని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తుందా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఇన్వెస్ట్మెంట్స్ నమ్మి మోసపోయిన 30 వేలమంది… ఇండియన్ సైబర్ క్రైమ్ సంచలన విషయాలు?




