
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- హీరో నాగార్జున, తన కుటుంబం పై గతంలో మంత్రి కుండా సురేఖ కొన్ని అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య మరియు సమంత మధ్య విడాకుల విషయంపై బయట ప్రపంచానికి నిజాలు ఏంటో తెలియదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ఇంటర్నల్ గా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి విషయాల్ని చెప్తున్నాను అని మంత్రి కొండ సురేఖ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో నాగార్జున ఫ్యామిలీ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున పరువు నష్టం దావా కేసును వేశారు. అయితే ఈ కేసు పై రేపు నాంపల్లి కోర్టులో విచారణ అనేది జరగనుంది. ఈ సందర్భంలో మంత్రి కొండ సురేఖ నాగార్జునకు క్షమాపణలు తెలియజేశారు. రేపు విచారణ జరుగుతున్న సందర్భంలో ఆమె ఇవ్వాలే క్షమాపణలు చెప్పడం గమనార్హం. కావాలనే వారిని కించపరచాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు అని పేర్కొన్నారు. నేను మాట్లాడిన విషయాలు పట్ల మీరు బాధపడి ఉంటే అందుకు నేను చింతిస్తున్నాను అని.. ఆ వ్యాఖ్యలు ను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆమె ట్వీట్ చేసారు.. ఈ విషయంపై అర్ధరాత్రి 12 గంటలకు మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మరి ఈ క్షమాపణలను నాగార్జున స్వీకరించి ఈ కేసును వెనక్కి తీసుకుంటారా?.. లేక అంతే ముందుకు వెళ్తారా?.. అనేది ఆసక్తికరంగా మారింది.
Read also : నిన్న ధర్మేంద్ర.. నేడు గోవింద.. వరుసుగా కుప్పకూలిపోతున్న బాలీవుడ్ సీనియర్ నటులు!
Read also : ఇండియన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సౌత్ ఆఫ్రికా సిరీస్ కు స్టార్ ప్లేయర్ దూరం?





