క్రీడలు

ఒకేరోజు ఇటు పాకిస్థాన్ పై అటు బాంగ్లాదేశ్ పై విజయం సాధించిన మెన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్స్

మన భారతదేశం ప్రస్తుతం అన్ని రంగాలలోనూ దూసుకుపోతుంది. పురుషులు, స్త్రీలు అనే బేధాలు లేకుండా ప్రతిఒక్క్కరు కూడా అన్నిట్లో పాల్గొంటు రానిస్తూ ఉన్నారు. మన భారతదేశం లో క్రికెట్ కి ఎంతగ ఆధరణ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లవాడి నుండి పెద్దవారిదాకా క్రికెట్ అంటే తెలియనోళ్లు ఉండరు. ఈ క్రికెట్ వల్ల బీసీసీఐ కి ఏన్నో కోట్లు కూడా లాభాలు అనేవి వస్తున్నాయి అంటే ఇక్కడే మనకి అర్ధమవుతుంది.

అయితే ప్రస్తుతం ఈ రోజు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకేరోజు మెన్స్ అలాగే ఉమెన్స్ t20 మ్యాచ్లు జరిగాయి. ఒకవైపు మహిళల t20 ప్రపంచ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో మన ఇండియన్ ఉమెన్స్ జట్టు తలపడింది. అలాగే మరోవైపు బాంగ్లాదేశ్ తో ఇండియా మెన్స్ జట్టు మొదటి t20 తలపడింది. ఇందులో విచిత్రం ఏంటి అంటే అటు మహిళలు పాకిస్థాన్ పై మరియు ఇటు పురుషులు బాంగ్లాదేశ్ పై సునాయసంగా గెలిపోంది అరుదైన రికార్డు ని నెలకొలిపారు. అంతే కాకుండా మన ఉమెన్స్ జట్టు t20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ పై గెలిచి బోణి కొట్టింది. ఇటుపక్క బాంగ్లాదేశ్ పై మొదటి t20 మ్యాచ్ గెలిసి సిరీస్ కైవసం చేసుకునే ఆలోచనలో మెన్స్ జట్టు ఉంది.

బాంగ్లాదేశ్ తో జరిగిన మొదటి t20 లో బాంగ్లాదేశ్ మొదటి బాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లు కి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్యం తో బరిలో దిగిన ఇండియన్ టీం కేవలం 11.5 ఓవర్లు లోనే చేదన చేసి సునాయసంగా గెలిపోందారు. ఇందులో హార్దిక్ పాండ్య (39), కెప్టెన్ సూర్య,శాంసన్ (29),నితీష్ (16) పరుగులు చేసారు.

మరోవైపు మహిళల t20 ప్రపంచం కప్ లో భాగంగా పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటగా బాటింగ్ చేసిన పాకిస్థాన్ టీమ్ 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఇందులో అరుంధతి (3), శ్రేయంక (2) దీప్తి, రేణుక, శోభనం తలో ఒక వికెట్ తీశారు. అనంతరం 106 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియా టీం 7 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేదించి విజయం అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ బ్యాటర్స్ షాఫలి వర్మ (32),కౌర్ (29),రోడ్రీగ్స్ (23) పరుగులతో రానిచ్చి జట్టు విజయము లో బాగమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button