- న్యాయవ్యాదిని హత్య చేయడం అప్రజాస్వామికం
- న్యాయవాదులకే రక్షణ లేకపోవడం బాధాకరం
- లాయర్స్ యూనియన్ మిర్యాలగూడ అద్యక్షులు పరమేశ్ పూసపాటి
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: న్యాయవాదులపై ఇటీలవల దాడులు పె రిగాయని, న్యాయవాదుల రక్షణ కరువైందని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని లాయర్స్ యూనియన్ మిర్యాలగూడ అద్యక్షులు పరమేశ్ పూసపాటి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో న్యాయవాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ యూనిట్ తీవ్రంగా ఖండించింది. సులేమాన్ నగర్‌లోని తన కార్యాలయంలో ఉన్న సమయంలో ఖదీర్‌ను దుండగలు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడాన్ని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఎఐఎల్‌యు) తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరుదేలే న్యాయవాది ఖదీర్‌ను హత్య చేయడం చట్టాలు ఏ విధంగా బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. దీనితో తోటి లాయర్లే భయాందోళనకు గురికావడం, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోవడం బాధాకరమన్నారు. న్యాయం వైపు నిలబడడం న్యాయవాదులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఐలు మిర్యాల గూడ అధ్యక్షులు పరమేశ్ నిందితులను వెంటనే చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో న్యాయవాదులపై ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబానికి ఐలు జిల్లా కమిటీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.ఈ కార్యక్రమంలో లాయర్స్ యూనియన్ సభ్యులు అంజయ్య, భవాని, రాజేష్, రమేష్ నాయక్, నాగరాజు, ఆర్. సైదులు రామ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
