Homeఅంతర్జాతీయంపెను ప్ర‌మాదంగా మారుతున్న యుద్దం తీవ్ర‌త‌... ప్రాణ భ‌యంతో ఇరాక్‌లోకి ఇరాన్ యువ‌త‌..!

పెను ప్ర‌మాదంగా మారుతున్న యుద్దం తీవ్ర‌త‌… ప్రాణ భ‌యంతో ఇరాక్‌లోకి ఇరాన్ యువ‌త‌..!

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: కొన్ని రోజులుగా యుద్ద మేఘాల‌తో ప‌శ్చిమాసియా అట్ట‌డుకుతుంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌మురు కొర‌త‌, ముడిస‌రుకు స‌ర‌ఫ‌రా వ్యాపార‌, వాణిజ్య స‌ముదాయాలు దాదాపు మూత‌ప‌డ్డాయి. కాగా అమెరికా, ఇజ్రాయెల్ దాడుల‌తో ఇరానీయుల ప‌రిస్థ‌తి అత్యంత ద‌య‌నీయంగా మారింద‌నే చెప్ప‌వ‌చ్చ‌వు. ఎప్పుడు ఎక్క‌డ క్షిప‌ణి ప‌డుతుందోన‌ని ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని కాలం వెల్ల‌దీస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కొంద‌రు ఆరానీయులు స‌రిహ‌ద్దులు దాటి ద‌క్షిణ ఇరాక్‌లోకి ప్ర‌వేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఇంటర్నెట్ నిలిచిపోవడం, వాణిజ్యం స్తంభించడం మొదలైన సమస్యలు అక్కడ సర్వ సాధారణంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో కొందరు ఇరానీయులు సరిహద్దులు దాటి దక్షిణ ఇరాక్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇరాక్‌లో త‌క్కువ ధ‌ర‌కు స‌రుకులు దొర‌క‌డ‌, ఇంట‌ర్నెట్ కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టీ మ‌రీ సరిహ‌ద్దులు దాటి ప్ర‌వేశిస్తు త‌న బంధువుల వ‌ద్ద త‌ల‌దాచుకుంటున్నారు.

యుద్దం త్వ‌ర‌గా ముగించాలి…

అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై నిరంత‌రం దాడులు చేస్తూనే ఉన్నాయి. దీంతో నిరంత‌రం వైమానిక దాడుల‌తో పేలుడు శ‌బ్దాల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని, ఇళ్లు ద్వంసం కావ‌డంతో పిల్ల‌లు సైతం భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నార‌ని అక్క‌డి మ‌హిళులు తెలుపుతున్నారు. కాగా ఇరాన్‌లో నిత్యావ‌స‌ర స‌రుకులు భారీ పెరిగి జీవ‌న ప్ర‌మానాలు త‌గ్గుతున్నాయ‌ని, యుద్దాన్ని త్వ‌ర‌గా ముగియాల‌ని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments