తెలంగాణ

ఆదాయం ఎక్కువే..అవస్థలు అంతకుమించినవే..!?

  • టార్గెట్ల నడుమ ఎక్సైజ్ శాఖ మార్కెటింగ్ లా మారిపోయిందా.!?

  • వసతులు లేక, సరైన బిల్డింగ్ లు లేక, శిధిలావ్యస్థలో ఎక్సైజ్ భవనాలు..!?

  • ప్రభుత్వ ఆదాయానికి పెద్ద కొడుకైనా..గవర్నమెంట్ దృష్టిలో చిన్నమ్మ కొడుకే..!?

  • పాత భవనాలు, పెచ్చులూడుతున్న పైకప్పులు..!?

  • ప్రభుత్వాలు మారినా.. ఎక్సైజ్ వాహనాల తీరు మారలే..!?

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్):- ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో, మొదటి వరుసలో ఉండే ఎక్సైజ్ శాఖ, వసతులు లేక నేడు అవస్థలు పడుతుంది..!? పాత బిల్డింగులు పెచ్చులూడుతున్న స్లాబ్ ల నడుమ, వారి విధులు ఆగమ్యగోచారంగా మారాయి..!? ఇదేకాక ప్రైవేట్ కంపెనీలు పెట్టినట్లుగా, ప్రభుత్వం వీరిపై టార్గెట్ల భారం మోపడంతో, నేడు ఎక్సైజ్ శాఖ మార్కెటింగ్ ల మారిపోయింది..!? ప్రభుత్వం ఏదైనప్పటికీ, ఆ ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ గుండె వంటిదనే చెప్పుకోవాలి.. అలాంటి ఎక్సైజ్ శాఖకు నేడు ఆదరణ కరువైందంటున్నారు నిపుణులు.!?

ప్రభుత్వ ఖజానాకుఆపుకారి వ్యవస్థ పెద్ద కొడుకైనప్పటికి, గవర్నమెంట్ దృష్టిలో చిన్నమ్మ కొడుకు మాదిరైపోయింది..!? రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలు, వాహనాలు డొక్కులుగా మారాయంటున్నారు ప్రజలు..!? ప్రభుత్వం నడవాలన్నా, పాలన బాగుండాలన్నా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేది ఈ శాఖనే.. అక్షయపాత్ర స్థానంలో ఉన్నప్పటికీ, ఈ శాఖ అధికారులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు..!? వైన్స్ టెండర్లను మూడు లక్షలకు పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత విడత కంటే, ఈ సారి ఎక్కువ టెండర్లు వేసేలా బాధ్యతలు తీసుకోవాలని, అధికారులకు టార్గెట్లు ఇచ్చినట్లు సమాచారం..!? ఈ టార్గెట్ కారణంగా హుందాత్వాన్ని ప్రదర్శించాల్సిన అధికారులు, వ్యాపారుల వైపు ఆశగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు పలువురు..!? ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికి, ఎక్సైజ్ శాఖ భవనాలు, వారి వాహనాలు పొగ సూరినట్లే ఉన్నాయంటున్నారు అనుభవజ్ఞులు..!? కనీసం కార్యాలయాల తలుపులకు కూడా, బలం లేకుండా అయిపోయిందంటున్నారు స్థానికులు..!?

కొన్ని ప్రాంతాలలో శిధిలావ్యస్థలో ఉన్న ఈ భవనాలు, ఎప్పుడు కూలి మీద పడుతాయో, అనే భయంతో డ్యూటీలు చేస్తున్నారు..!? నల్లగొండ జిల్లాలోని పలు ఎక్సైజ్ కార్యాలయాల పరిస్థితి, గోరంగా ఉందంటున్నారు ప్రజలు..!? గర్రుమనే వాహనాలు, రంగులు వెలిసి, శిధిలావ్యస్థలో ఉన్న కార్యాలయాలు పలు చోట్ల దర్శనం ఇస్తున్నాయి..!? టార్గెట్ లు ఇచ్చినట్లే, ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నత అధికారులు ద్రుష్టి పెట్టి, భవన నిర్మాణాలు, కొత్త వాహనాలు ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు..!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button