
కంటతడి పెట్టిస్తున్న కస్తూరిబా కష్టాలు..
బిల్డింగ్ సదుపాయం లేక చిన్నారుల అవస్థలు.
అదనపు గదుల కొరతతో ఇబ్బందులు..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి కి విద్యార్థుల వేడుకోలు.
మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):-మండలంలోని కస్తూరిబా స్కూల్ నందు గదులు సరిపోక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. మెరుగైన విద్యా బోధనలో రాజీపడని ఉపాధ్యాయులకు, గదులు లేక చిన్నారులు పడుతున్న అవస్థకు చెమ్మగిల్లుతున్నారు. ఎవరికి చెప్పాలో అర్ధం కాక సతమతపడుతున్నారు. కస్తూరిబా పాఠశాలలో ప్రతి సంవత్సరం బాలికల సంఖ్య పెరుగుతూనే పోతున్నా ఈ సమస్య వారిని వెనక్కి నెట్టేస్తుంది. ప్రస్తుతం పాఠశాల నందు బాలికల సంఖ్య 305కు చేరింది. 6 నుండి పదవ తరగతి మాత్రమే ఉన్న, కస్తూరిబా ఇంటర్ విద్యకు కూడా ప్రమోట్ అయ్యింది. కానీ పాత బిల్డింగ్ లోనే జరుగుతున్న సర్దుబాటు నేడు కస్తూరిభాలో పెద్ద సమస్యగా మారింది. విద్యార్థులకు సరైన సదుపాయాలు లేక, తరగతి గదులు లేక, కొంత మేరకు ప్రహరీ గోడ నిర్మాణం లేక పడుతున్న అవస్థకు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యే సాబ్ చొరవ తీసుకొని తక్షణ చర్యలకు ఆదేశించాలని, హాస్టల్ లోని మౌలిక సదుపాయాలు పరిశీలించాలని విద్యార్థినిలు కోరుతున్నారు.