
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ : టీబీ (ట్యూబర్ కులోసిస్ ) త్వరితగతిన గుర్తించి నివారించడమే లక్ష్యంగా “సీవై -టీబి” పరీక్ష ను తంగడపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్. యశోద, ఉప జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి అద్వర్యం లో డాక్టర్. కాటంరాజు తో కలిసి లాంచనంగా మంగళవారం ప్రారంభించడం జరిగినది.
ఈ సందర్భంగా డాక్టర్. యశోద మాట్లాడుతూ… ఎవరైతే టీబీ వ్యాధి వున్నవారితో దగ్గరగా జీవిస్తుంటారో అనగా కుటుంబ సభ్యులు, చికిత్స చేయువారు మొదలైన వారికీ ఈ టెస్ట్ నిర్వహించడం ద్వారా ముందుగానే వ్యాధిని గుర్తించి తగు చర్యలు తీసుకొనుట ద్వారా టీబీ ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త పడవచ్చని, తద్వారా టీబీ ని నివారించవచ్చునని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో డాక్టర్. కాటంరాజు,టీబీ యూనిట్ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, వసంతకుమారి, హెల్త్ ఎడ్యుకేటర్, వేణుగోపాల్, సరళ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.