కోపంతో నెంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడునే చంపిన ప్రియురాలు?

క్రైమ్ మిర్రర్, క్రైమ్ న్యూస్ :- ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోని ప్రేమ వ్యవహారాలు ఆఖరికి చావు వరకు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రేమించుకున్న యువత ఈమధ్య ఎంతోమంది మరణించారు. కొంతమంది ఇళ్లలో ప్రేమ పెళ్లికి ఒప్పుకోక, మరి కొంతమంది ఒప్పుకుంటారో లేదో అనే అనుమానంతోనే చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా చతిస్గడ్ లోని జరిగినటువంటి ఒక ప్రేమ హత్య ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నెంబర్ బ్లాక్ చేశాడన్న కోపంతో ప్రియురాలు ఏకంగా తన లవర్ ని చంపేసింది. ఇక అసలు వివరాల్లోకి వెళితే చతిస్గడ్ రాష్ట్రంలోని రతన్పూర్ కు చెందినటువంటి ప్రసాద్ సూర్యవంశంకి ఇన్స్టా వేదికగా రోషిని తో ప్రేమ వ్యవహారం ఉంది. అయితే గత కొద్ది రోజుల నుంచి వారిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండగా ప్రసాద్ ఆమె నెంబర్ ను కోపంలో బ్లాక్ చేశాడు. ఇక అవన్నీ పట్టించుకోని యువత నా నెంబర్ బ్లాక్ చేస్తాడా?.. అంటూ తన లవర్ హాస్టల్ కి వెళ్లి మరి నేరుగా గుండెల్లో కత్తితో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలతో రక్తస్రావమై ప్రసాద్ అక్కడికక్కడే కుప్పకూలీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చూసిన హాస్టల్లోని ఇతర వ్యక్తులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక వెంటనే హాస్టల్లోని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. కేవలం నెంబర్ బ్లాక్ చేసినందుకే కోపంతో రగిలిపోయిన ఆ రోషిని అనే యువతి కత్తితో పొడిచింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా నేరుగా చంపేయడమేంటి అని స్థానికులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి యువత సొసైటీ లో చాలా మంది ఉన్నారు అని వీరందరితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ పెద్దలు సూచిస్తున్నారు.

Read also : స్కూలు విద్యార్థినిపై కోతుల దాడి

Read also : రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏమందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button