
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- రష్మిక మందన దాదాపు కొన్ని నెలల తర్వాత వస్తున్నటువంటి సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అవ్వగా థియేటర్లకు భారీ ఎత్తున జనం క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ లో చిక్కుకుపోయి.. బయటపడలేక అందులోనే నలిగిపోయినటువంటి ఒక అమ్మాయి ( రష్మిక మందన) దే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా స్టోరీ. పైకి చాలా ఆనందంగా నవ్వుతున్నట్లు కనిపించిన కూడా లోపల ఎనలేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక మందన ఇరగకొట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంక డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా అతను చెప్పే విధానంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు ఈ డైరెక్టర్ అందించారనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సాంగ్స్ మరియు బిజిఎం. నిజం చెప్పాలంటే ఈ రెండిటి వల్లనే సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఒక రిలేషన్షిప్ లో నలిగిపోయినటువంటి అమ్మాయి గురించి చెప్పడమే కథ కాబట్టి సినిమా మొత్తం ఎమోషన్లతో నిండిపోయింది. దీని కారణంగానే ఈ సినిమా కథ కాస్త స్లోగా సాగినట్లు అనిపించినా కూడా ఎక్కడా కూడా బోర్ కొట్టే అవకాశం లేదు. ఇక ఫస్ట్ ఆఫ్ లో మాత్రమే కొన్ని అనవసరపు సీన్లు అటాచ్ చేసారు.. చివరిలో కథ ఊహించే విధంగా ఉండడం కారణంగానే కాస్త మైనస్ అని చెప్పవచ్చు. సో ఓవరాల్ గా ఈ సినిమా ద్వారా రష్మిక మందన నటనలో మరో మెట్టు ఎక్కారనే చెప్పవచ్చు.
రేటింగ్ : 2.75/5
Read also : అవన్ని అవాస్తవాలు.. సచివాలయాల పేరు మార్చలేదు : CMO
Read also : మరో మతాన్ని కించపరచను.. తలైన నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను : బండి సంజయ్





