తెలంగాణ

కాంగ్రెస్ కు మొదటి ఎదురుదెబ్బ జూబ్లీహిల్స్ లోనే జరుగుతుంది : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ లోనే మొదటి ఎదురు దెబ్బ తగులుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మొదటి దెబ్బ కొట్టబోతుంది అని తాజాగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్ లో కొట్టి తీరుతామని స్పష్టం చేశారు. రెండుచోట్ల కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది అని… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also : బ్రేకింగ్ న్యూస్.. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మృతి చెందిన టిడిపి నేత

ఇక మరోవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మరోసారి కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసరడంతో ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమే అని… బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని సృష్టిస్తున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. పొరపాటున బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచింది అంటే… కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పవచ్చు. అలాకాకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిస్తే ఇక జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ హవానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇరు పార్టీలకు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి.

Read also : రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. అజాగ్రత్తగా ఉంటే అంతే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button