తెలంగాణ

ఆర్టీసీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు

మనిషికి ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. అప్పటివరకు హుషారుగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఆఫీసులో కూర్చున్న వ్యక్తి.. చైర్ లోనే విగతజీవులుగా మారుతున్నారు. ఆనందంతో డ్యాన్స్ చేస్తూ సడెన్ గా పడిపోయి ప్రాణం విడుస్తున్నారు. గుండెపోట్లు విపరీతంగా పెరిగిపోయాయి. వృద్దులు, మధ్య వయస్కులే కాదు చిన్న పిల్లలు సైతం గుండెపోట్లకు గురవుతున్నారు. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్.. బస్సు నడుపుతూనే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ప్రయాణికుల ప్రాణాలకే గండం వచ్చింది.

Read More : చంద్రబాబుతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటి!

సిద్దిపేట – గజ్వేల్‌ వద్ద హుజురాబాద్‌ ఆర్టీసీ డిపోకి చెందిన‌ బస్సు హుజురాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. ఇంతలోనే బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింజి. ఛాతిలో నొప్పిగా రావడంతో బస్సు పక్కకు ఆపి ప్రయాణికులకు చెప్పారు రైవర్‌ రమేష్‌ సింగ్‌. ప్రయాణికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో డ్రైవర్‌ రమేష్‌సింగ్‌ మృతి చెందాడు. గుండెపోటు రాగానే చాకచాక్యంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. డ్రైవింగ్ చేస్తుండగానే పడిపోతే తీవ్ర ప్రమాదం జరిగేది. డ్రైవర్ తో పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా పోయేవి.

Spread the love
Back to top button