
చండూరు, క్రైమ్ మిర్రర్:- సన్న బియ్యం పంపిణీ దేశ చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప విషయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరులో ఆయన శుక్రవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ చేసింది అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం , 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నామన్నారు, సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి తెలంగాణ ప్రజల తరఫున మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఉప ఎన్నిక వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారన్నారు.
కానీ తమ ప్రజా ప్రభుత్వంలో ఉప ఎన్నికలు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామన్నారు.
రాబోయే రోజుల్లో పింఛన్లు రేషన్ కార్డులు, పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత తనది అన్నారు. నియోజకవర్గంలో ఆక్రమంగా మద్యం అమ్మిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాంమన్నారు.
బెల్ట్ షాపులు మూసివేసిన చాటుమాటుగా మద్యం అమ్మే వాళ్లను ఉపేక్షించమని కేసులు పెట్టించి జైలుకు పంపిస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తప్పు చేసిన వ్యక్తి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.తను ఎప్పుడూ ధర్మం వైపే పని చేస్తానని,ధర్మం వైపే ఉంటానన్నారు.అంతకు ముందు బంగారు గడ్డలో నూతనంగా మంజూరైన ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్..? – రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపిస్తున్న నేతలు
సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ మధ్య వాగ్వాదం – అసలు ఏం జరిగిందంటే..?