
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజుల నుంచి వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదలు దాటికి తాజాగా ఖాతాలోని వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఆకస్మికంగా వచ్చిన వరదలు దాటికి కొండ చరియలు భారీగా విరిగిపడ్డాయి. ఈ కొండ చరియలు విరిగిపడడం కారణంగా ఏకంగా 30 మంది యాత్రికులు అందులో చిక్కుకుపోయి మరణించడం జరిగింది. దాదాపు మరో 23 మంది వరకు తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల కారణంగా వైష్ణో దేవి యాత్ర మార్గంలో ఉన్నటువంటి కొండ చరియలు చాలా దూరం వరకు విరిగిపడ్డాయి. దీంతో చాలామంది భక్తుల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉందని స్థానికులు మీడియా వేదికగా చెబుతున్నారు.
ఉత్తరాదిలో వరద బీభత్సం, 30 మంది మృతి
ఇక ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ అలాగే ఎన్టీఆర్, రిస్క్యూ ఆపరేషన్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కొండ చరియలలో ఇరుక్కుపోయిన వారిని ఆర్మీ అలాగే NDRF రిస్క్యూ ఆపరేషన్ బృందాలు బయటకు తీసేందుకు చాలానే కష్టపడుతున్నాయి. ఈ వరదల కారణంగా చాలా చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు, పవర్ లైన్లు అలాగే టవర్స్ లాంటివి అన్నీ కూడా ధ్వంసమై భయానకర పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్లీ ఇక్కడ జీవనం చేయాలంటేనే ప్రజల గుండెల్లో వణుకు పుడుతుంది. మరోవైపు వీటి చుట్టూ ఉన్నటువంటి రావి, చినాబ్, తావి అలాగే బియాస నదులు ఉగ్రరూపం దాల్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ నదులలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి కొద్ది సేపట్లో అప్డేట్ తో మీ ముందుకు వస్తాం.. చూస్తూ ఉండండి మీ క్రైమ్ మిర్రర్ న్యూస్..
Read also : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు ఏపీలో భారీ వర్షాలు