
ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, మాడుగులపల్లి: ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళలపై,బాలికలపై అత్యాచారాలు, అగత్యాలు రోజురోజుకి పెరుగుతూనే వస్తున్నాయి వీటిని నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయి అని జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు…
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 14వ జాతీయ మహాసభల సందర్భంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి స్థానిక ఐద్వా సంఘం సభ్యులతో కలిసి మండల కేంద్రంలోని మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఐద్వా 14 వ మహాసభల గురించి శనివారం ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు.
Also Read:వడ్లు కొనుగోలు లేదు… రోడ్డు ఎక్కిన రైతన్నలు
ఈ సందర్భంగా పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ… మహిళలపై, బాలికలపై, హత్యలు, అత్యాచారాలు నేటికీ పెరిగి పోతూఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కూడా రోజురోజుకీ అగత్యాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్, మద్యం మత్తులో ఈ నేరాలు జరుగుతున్నాయి అన్నారు. వీటిని నియంత్రించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఇవ్వలేదు, అకాల వర్షాలతోటి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లేదు తడిసిన ధాన్యాన్ని గవర్నమెంట్ రేటు ప్రకారంగా కొని వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు…
చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలి,మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నారు. ఆర్థికంగా వెనకబడి పోతున్నారు అన్నారు. సరైన తిండి తినలేక గర్భిణీ స్త్రీలు రక్తహీనతకు గురవుతున్నారు అన్నారు. నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి , జిల్లా సహాయ కార్యదర్శి పాదూరు గోవర్ధన రెడ్డి, మాడుగులపల్లి మండల కార్యదర్శి తంగేళ్ల నాగమణి, వేములపల్లి మండల కార్యదర్శి అని రెడ్డి మాధవి, తదితరులు పాల్గొన్నారు…
Also Read:అప్పుల్లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన తెలుగు రాష్ట్రాల ప్రజలు?





