
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్::- దేశవ్యాప్తంగా ఈ రోజు జరగాల్సిన మాక్ డ్రిల్ రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు 259 ప్రాంతాల్లో ఢిఫెన్స్ డ్రిల్ నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మొదట ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని భావించారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నంలోనూ డ్రిల్ నిర్వహిచాల్సి ఉంది. కానీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరవాత పాకిస్థాన్ మరియు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మిస్సైల్స్‌తో దాడులకు పాల్పడింది.
ఈ దాడుల్లో ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దాదాపు వంద మంది ఉగ్రవాదులు ఇందులో మరణించినట్టు తెలుస్తోంది. దీంతో ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈరోజు నిర్వహించాల్సిన మాక్ డ్రిల్ రద్దు చేసుకున్నట్టు కనిపిస్తోంది.