ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!.. క్షణాల్లో ఆరుగురు మరణం?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో.. ఒంగోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఆరుగురు మరణించడం జరిగింది. కోడిగుడ్ల లోడ్ తో వెళుతున్న ఒక లారీ ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో బోల్తా పడింది. అది హైవేలో ఈ ప్రమాదాన్ని చూసినా వెనకాల కారు సడన్ గా బోల్తా పడిన లారీ వెనుక ఆగిపోయింది. బోల్తా పడిన లారీని చూసి బతికిపోయాం అని అనుకునే లోపే వెనకాల నుంచి మరో లారీ మృత్యువు రూపంలో ఆగి ఉన్న కారుపై దూసుకు వెళ్ళింది. దీంతో ముందు బోల్తా పడిన లారీ.. వెనుకాల లారీ మధ్యలో ఉన్న కారు నలిగిపోయి పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా,ఒంగోలు మండలం కొప్పోలు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఇక ఈ ఘటనలో బోల్తా పడిన లారీ తో పాటు కారులోని వారి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తంగా ఆరు మంది మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మరి కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా ఇప్పటికే ఈ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోల్తా పడిన లారీ తో పాటు కారులోని మృతదేహాలని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం లారీ డ్రైవర్ల నిద్రమత్తు… అతివేగమే కారణం అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని… మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం కూడా అందించామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇప్పటికే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దీంతో అధికారులు ఈ రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంపై.. విమర్శలకు సిద్ధం అవుతున్న షర్మిల!.. మోడీనే కారణమా?

పవన్‌ దగ్గుతున్నాడని విక్స్‌ చాక్లెట్‌ ఇచ్చిన మోడీ – అభిమానమా…! వ్యూహమా…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button