Tuesday, March 10, 2026
Homeఆంధ్ర ప్రదేశ్రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కీలక నేత!.. వ్యవసాయమే నా భవిష్యత్తు?

రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కీలక నేత!.. వ్యవసాయమే నా భవిష్యత్తు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు వైయస్సార్ పార్టీ కీలక నేత మరియు జగన్ సన్నిహితుడు విజయ్ సాయి రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటుగా రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లుగా తెలిపారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చారు విజయ్ సాయి రెడ్డి. అయితే రాజీనామా చేసిన మరుక్షణం ఎటువంటి పార్టీలోను చేరబోనని స్పష్టం చేశారు. ఇక భవిష్యత్తులో జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో నాకు ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నాకు మంచి స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. ఇక రాజకీయాలు వదిలేసి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడతానని అన్నారు. వ్యవసాయమే నా భవిష్యత్తు జీవితమని తెలిపారు.

Read also
1.రూ. 55 లక్షలకు కిడ్నీ.. హైదరాబాద్ కేసులో సంచలనాలు

2.మియాపూర్‌లో దారుణం.. యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం, కేసు నమోదు!!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments