ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

పులివెందులలో పోటాపోటీ – వైసీపీ పట్టు నిలిచేనా…? టీడీపీ పంతం నెగ్గేనా..?

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో :-జగన్‌ అడ్డా పులివెందుల పోటీకి సై అంటోంది. అమీతుమీ తేల్చుకునేందుకు టీడీపీ, వైసీపీ సిద్ధమవుతున్నాయి. నీ పెతాపమా…? నా పెతాపమా…? తేల్చుకుందామంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాయి ఇరుపార్టీలు. మరి.. పులివెందులలో గెలుపెవరిది…? వైసీపీ మరోసారి సత్తా చాటబోతుందా..? మార్పునకు నాంది పడుతుందా…? ఇంతకీ.. ఈ పోటీ ఎందుకు…?

Read also : AI పేరుతో శ్రీవారి ధనాన్ని వృధా చేయకండి.. తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం అసంభవం : టీటీడీ మాజీ EO

పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక కాకరేపుతోంది. జెడ్పీటీసీ మహేశ్వర్‌రెడ్డి రోడ్డుప్రమాదంలో మరణించడంతో… బైఎలక్షన్‌ వచ్చింది. వైసీపీ… మహేశ్వర్‌రెడ్డి కుటుంబానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు హేమంత్ కుమార్‌ నామినేషన్‌ వేశారు. మహేశ్వర్‌రెడ్డి మరణం వల్ల వచ్చిన బైఎలక్షన్‌ కావడంతో.. పోటీ పెట్టొద్దని వైసీపీ విజ్ఞప్తి చేసింది. కానీ.. టీడీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. పులివెందుల జగన్‌ అడ్డా… అక్కడ జరుగుతున్న ఎన్నికను ఏకపక్షం కానివ్వకూడదని గట్టి పట్టుదలతో ఉంది తెలుగుదేశం పార్టీ. జగన్‌ను దెబ్బ కొట్టేందుకు.. అది కూడా ఆయన అడ్డాలో దెబ్బతీసేందుకు… ఇచ్చే చిన్ని అవకాశాన్ని కూడా వదులుకోకూడదని భావిస్తోంది. అందుకే… జెడ్పీటీసీ ఎన్నికల బరిలో దిగింది. టీడీపీ తరపున… ఆ పార్టీ నేత బీటెక్‌ రవి భార్య లతారెడ్డిని బరిలోకి దింపుతోంది. లతారెడ్డితోపాటు బీటెక్‌ రవి తమ్ముడు జయభరత్ రెడ్డి కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో.. ఇరుపార్టీలు సై అంటే సై అంటున్నాయి.

పులివెందుల వైసీపీ అడ్డానే కానీ… పరిస్థితులు మాత్రం జగన్‌ పార్టీకి వంద శాతం అనుకూలంగా లేవు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పులివెందు జెడ్పీటీసీ ఉపఎన్నిక బాధ్యతలు చేపట్టారు. అయితే… పార్టీ కేడర్‌ను ఆయన ఏకతాటిపై నడిపించలేకపోతున్నారని సమాచారం. అంతేకాదు… జగన్‌కు వరుస సోదరుడైన కమలాపురం ఇంఛార్జ్‌ దుష్యంత్‌రెడ్డి కూడా టీడీపీ దగ్గరయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి. వైసీపీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న పుష్పనాథ్‌రెడ్డి టీడీపీలో చేరడం కూడా జగన్‌ పార్టీకి స్థానికంగా నష్టమే. ఇక… కుటుంబపరంగా చూసుకున్న… జగన్‌ వర్గం, షర్మిల వర్గం, సునీత వర్గమంటూ… కేడర్‌ అంతా ముక్కుముక్కలైంది. ఈ పరిస్థితుల్లో… వైసీపీకి మెజార్టీ రావడం… అంత ఈజీ కాదు.

Read also : రాష్ట్రంలో మరో దారుణం… గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో తల్లి, ఇద్దరు కుమార్తెలు బలి!

ఇక.. సీఎం చంద్రబాబు జగన్‌ అడ్డాపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. జగన్‌ను దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు అస్త్రంగా మారబోతున్నాయి. ఈ రెండు స్థానాలు కైవసం చేసుకుని… జగన్‌కు గట్టి షాక్‌ ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా.. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి.. పులివెందుల పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారట. పులివెందులలో టీడీపీ గెలిస్తే.. జగన్‌ పనైపోయిందని ప్రచారం చేయాలన్న యోచనలో ఉన్నారు చంద్రబాబు. మరోవైపు… టీడీపీని ఓడగొట్టి.. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా పెరిగిందని ప్రచారం చేసుకునే యోచనలో ఉన్నారు వైఎస్‌ జగన్‌. మరి పులివెందులలో నెగ్గేదెవరో..? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button