ఆంధ్ర ప్రదేశ్

ఇచ్చిన మాట నెరవేర్చిన కూటమి.. అభ్యర్థుల ముఖాల్లో వెలుగులు!

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నెరవేర్చింది. యువగలంలో భాగంగా మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాగానే మెగా DSC నోటిఫికేషన్ ఇస్తామని.. పరీక్షలు జరిపి ఎంపికైన విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూటమి నాయకులందరూ కూడా DSC నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తారని యువకులకు హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారు. అయితే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీఎస్సీ నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేసి కూడా.. చివరిలో చేతులెత్తేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం మాత్రం డీఎస్సీ విషయంలో వెనక్కి తగ్గలేదు.. ఇచ్చిన హామీ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు జరిపి.. ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు నేడు నియామక పత్రాలు అందజేయనుంది.

Read also : అనుకున్నదే జరిగింది.. OG మూవీ రివ్యూ!

ఇందులో భాగంగానే నేడు మెగా డీఎస్సీ కి దాదాపు 15,941 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షన నియామక పత్రాలు అందజేయనుంది. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అది మా ప్రభుత్వానికి, నిరుద్యోగులు పట్ల ఉన్న నిబద్ధత అన్నారు. ఇవాళ అమరావతిలో ఈ కార్యక్రమం జరుగుతుందని… సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కూటమి మంత్రులు, కూటమి నాయకులు, డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు హాజరుకానున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని నారా లోకేష్ తెలిపారు. ఈ డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఏకంగా 7955 మంది మహిళలు డీఎస్సీ జాబ్స్ కు ఎంపికయ్యారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొని ఇంతవరకు వచ్చారు. ఇవాళ వాళ్లు కలలు కన్నా కళలు నెరవేరుతున్న సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

Read also : ఆపదలో ఉన్నారా?.. ఈ ఎమర్జెన్సీ నెంబర్లు సేవ్ చేసుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button