Wednesday, March 25, 2026
Homeక్రీడలుఫైనల్ మ్యాచ్ లో రికార్డ్స్ నెలకొల్పిన 15 సంవత్సరాల కుర్రాడు.?

ఫైనల్ మ్యాచ్ లో రికార్డ్స్ నెలకొల్పిన 15 సంవత్సరాల కుర్రాడు.?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా నిన్నటి రోజున భారత్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించి ట్రోఫీని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో భాగంగానే మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 411 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ సూర్యవంశి కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. అంత చిన్న వయసులో ఇలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబరిస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా ఇతన్ని అరెస్ట్ చేయాలి అంటూ జోక్స్ వేస్తూ అప్రిషియేట్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశి తన బ్యాట్ తో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించారు. ఏకంగా 15 సిక్సులు, 15 ఫోర్లు కొట్టి రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా మరోవైపు ఫాస్టెస్ట్ 150 కొట్టిన ప్లేయర్ గాను ఫైనల్ మ్యాచ్లో రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో భారత్ అండర్ 19 క్రికెట్ జట్టు 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు తరుపున కాలేబ్ ఫాల్కనర్ సెంచరీ తో రాణించినప్పటికీ ఇతర ప్లేయర్లు తక్కువ పరుగులకే అవుట్ అవ్వడం కారణంగా ఓడిపోయారు. ఏది ఏమైనా కూడా ఆయుష్ మాత్రమే కెప్టెన్సీలో భారత జట్టు మరో టి20 ట్రోఫీని గెలుచుకుంది. ఈ మ్యాచ్ లో నిజంగా 15 సంవత్సరాల యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించారు.

Read also : వాహనాలకు అమరుచుతున్న ఎల్ఈడి లైట్లతో ప్రమాదమే.!

Read also : శాంతిభద్రతల పరిరక్షణకే ఫ్లాగ్‌ మార్చ్‌

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments