-
సర్పంచ్ అంజయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నా గ్రామా ప్రజలు
-
భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై వెంటనే స్పందించాలని విన్నపం
క్రైమ్ మిర్రర్, మాడ్గులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలము, పాములపహాడ్ గ్రామంలో ఇటీవల కోతుల బెడద అధికమవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ సమావేశంలో తీర్మానం చేశారు. గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కునుకుంట్ల అంజయ్య చర్యలు చేపట్టారు.
తీర్మానం ప్రకారం కోతులను తరిమికొట్టేందుకు ప్రత్యేకంగా కొండముచ్చును గ్రామానికి తెప్పించారు. సాధారణంగా కోతులు కొండముచ్చును చూసి భయపడి పారిపోతాయని భావిస్తూ ఈ చర్య తీసుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామస్థుల నుంచి మంచి స్పందనను పొందింది.
గ్రామంలో కోతుల బెడద తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ గ్రామ పెద్దలు, ప్రజలు సర్పంచ్ అంజయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
