తెలంగాణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సజ్జనార్ సూచన

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం. కొందరు తమ టాలెంట్‌తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. కొత్త తరహా వీడియోలు, కంటెంట్‌తో ఫ్యాన్స్ సంపాదించుకుంటున్నారు. ఆ తర్వాత కాసుల కోసం ఫెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. కొన్ని బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ ట్రేడింగ్, గేమ్స్ వంటి వాటికి ప్రమోషన్స్ చేస్తున్నారు. తాము గంటలో ఇన్ని వేలు సంపాదించామని.. రోజుకు లక్షల్లో ఆదాయం వస్తుందని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాటిని నమ్మి చాలా మంది నట్టేట మునుగుతున్నారు. ఇంకొందరైతే ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వీడియోల్లో చెప్పిందంతా నిజమని గుడ్డిగా నమ్మి సర్వం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. కీలక సూచనలు చేశారు.

Read Also : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. అల్లు అర్జున్ రెగ్యలర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా

మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం సరికాదని అన్నారు. మీ మాటలు నమ్మి చాలా మంది తమ బంగారు జీవితాలను చిద్రం చేసుకుంటున్నారని.. కాసుల కోసం కక్కుర్తి పడి ఇటువంటి యాప్స్ ప్రమోట్ చేయటం సరైంది కాదని ట్వీట్ చేశారు. ‘సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లరా!! కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని.. మీరు సోషల్ మీడియాలో వదిలే ఇలాంటి వీడియోల వల్ల అమాయకులు ఆన్‌లైన్ బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులు అవుతున్నారు.

Also Read : 12 సంవత్సరాల తర్వాత… బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా విజయం

బంగారు జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. మీ స్వలాభం కోసం ప్రజాశ్రేయస్సును విస్మరించడం ఎంత వరకు సమంజసం!? సమాజ క్షేమం పట్టని మీ పెడధోరణులు క్షమించరానివి. కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచన అనర్థదాయకమైనదని యువత గుర్తించాలి. స్వార్ధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. చాపకిందనీరులా సామాజిక సంక్షోభాన్ని సృష్టిస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ మాయలో పడకండి. ఇలాంటి సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండండి.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు. కాగా, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సజ్జనార్.. ఎప్పటికప్పుడు ఇటువంటి సందేశాలు, సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించే వీడియోలు షేర్ చేస్తుంటారు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన విషయాలు, ఉద్యోగుల పనితీరు తదితర అంశాలను నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండి : 

  1. పదవులకే వన్నే తెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్.. సీఎం రేవంత్ రెడ్డి
  2. తెలంగాణ పోలీస్ కొత్త లోగో.. విడుదల చేసిన తెలంగాణ పోలీసులు
  3. మన్మోహన్ కు భారతరత్న ఇవ్వడంపై పూర్తిగా మద్దతు తెలుపుతాం: కేటీఆర్
  4. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
  5. తొలిసారి టైటిల్ గెలిచిన హర్యానా!… ఎట్టకేలకు నెరవేరిన కోచ్ కళ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button