
క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- జపాన్ దేశంలో తాజాగా గంట క్రితం సమయంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్ పై తీవ్రత 7.6 నమోదయింది అని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లలోని వస్తువులు ఎక్కడికి అక్కడ పడిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్నటువంటి జపాన్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఇక ఎక్కువగా టోక్యోకు సమీపంలో భూప్రకంపనలు వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఆ దేశ అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భారీ భూకంపం నేపథ్యంలో ప్రాణ అలాగే ఆస్తి నష్టం పై వివరాలు స్పష్టం చేయాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో జపాన్లో ఇలాంటి భూకంపం ప్రకంపనలు ఎన్నోసార్లు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం తీవ్రస్థాయిలో వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
Read also : సర్పంచులను గెలిపించాల్సిన బాధ్యత మీది.. అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది
Read also : వైరలవుతున్న తమన్నా, శ్రీలీలల బాత్రూం ఫోటోలు





