
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో-9 పై హైకోర్టు స్టే విధించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఈ కేసును జస్టిస్ విక్రమ్ నాథ్ అలాగే జస్టిస్ సందీప్ మెహతా వీరిద్దరితో కూడిన ధర్మాసనం విచారించనుందని సమాచారం. దీంతో సుప్రీంకోర్టులో రేపు బీసీ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం బయటికి వస్తుందా అని ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీన బీసీ సంఘాలు అలాగే బీసీ నాయకులు బంద్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ బందుకు తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలు కూడా పూర్తిగా మద్దతునిచ్చాయి.
Read also : వాళ్ళిద్దరూ ఒక్కసారి చర్చిస్తే చాయ్ తాగే లోపు పని అయిపోతుంది : కేటీఆర్
ఇక ఇంకోవైపు కేటీఆర్ బీసీ రిజర్వేషన్లు గురించి మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు గురించి ఎంత కొట్లాడుకున్నా, పొట్లాడుకున్నా.. ఫలితం అయితే ఉండదు అని… నేరుగా ఢిల్లీకి వెళ్లి చర్చించుకోవాల్సిన సమయం ఇది అని అన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటే మేము మాత్రం ఎందుకు అడ్డుకుంటామని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కూర్చుని ఒక నిర్ణయానికి వస్తే ఈ బిల్లు మరుసటి రోజే చట్టంగా మారి అమల్లోకి వస్తుంది అని చెప్పుకొచ్చారు. కాగా రేపు సుప్రీంకోర్టు తీర్పుపై ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
Read also : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డ్.. అబార్షన్ సమయంలో యువతి మృతి..!