
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి రైతులను పరామర్శించారు. మొంథా తుఫాన్ కారణంగా ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో పంటలు నష్టపోయాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ కవిత మాత్రం నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎకరాకు పదివేల రూపాయలు రైతులకు ఏ మూలకు సరిపోవు అని.. మండిపడ్డారు. పూర్తిగా దెబ్బతిన్నటువంటి పంటలకు ప్రభుత్వం ఖచ్చితంగా 50 వేల రూపాయలు ఇచ్చి తీరాలి అని కవిత డిమాండ్ చేస్తూ రైతులకు అండగా నిలబడ్డారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేల రూపాయలు కనీస పెట్టుబడులకు కూడా రావు అని.. మీరు ప్రకటించిన పదివేల వల్ల ఏమాత్రం ఉపయోగం కూడా ఉండదు అని ఆగ్రహించారు. మొలకెత్తిన, బూజు పట్టినా, తేమశాతం ఎక్కువగా ఉన్నా కూడా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. లేదంటే ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వంపై వ్యతిరేక నిరసనలు చేపట్టాల్సి ఉంటుంది అని తెలిపారు. ఇటువంటి కష్ట కాలంలోనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రైతుల పట్ల, రైతు సాగు చేసే వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరికి అండగా ఉండే బాధ్యత నాది అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : కిషన్ రెడ్డి ఆరోపణలపై స్పందించిన అజహారుద్దీన్
Read also : రన్ ఫర్ యూనిటీ… ఐక్యమత్యమే మహాబలం
 
				 
					
 
						 
						




