
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-
దేశవ్యాప్తంగా నేడు దీపావళి పండుగ సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా దీపాలతో వెలుగులు వెదజల్లుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామ మందిరమైతే ఏకంగా కొన్ని లక్షల విద్యుత్ దీపాలతో రంగురంగులుగా వెలిగిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయోధ్యలోని రాజభవనం పై ఉన్న గోపురాలు సూర్యచంద్రుల తేజసును మించి ప్రకాశిస్తున్నాయని రామజన్మభూమి తాజాగా సోషల్ మీడియా వేదిక గా ట్వీట్ చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దీపోత్సవం చాలా ఘనంగా నిర్వహించాలని నిన్నే ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కొన్ని లక్షల విద్యుత్ దీపాలతో అయోధ్య గిన్నిస్ రికార్డ్ సృష్టించాలనే దిశగా అడుగులు వేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ సత్యాన్ని ఓడించలేమని ప్రతి దీపం గుర్తు చేస్తుంది అని ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయం అని అన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలలో కూడా దీపావళి పండుగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Read also : CMR షాపింగ్ మాల్స్, చందన బ్రదర్స్ అధినేత కన్నుమూత
Read also : కళాకారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రత్యేక పింఛన్లు