
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రతి సంవత్సరం కూడా ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ సక్రమంగా విజయాలను అందుకోలేకపోయింది. కానీ ఈ ఏడాది సీజన్ 12 లో మాత్రం అద్భుతమైన విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. గతంలో తెలుగు టైటాన్స్ జట్టు ఎప్పుడూ కూడా వరుసగా ఐదుసార్లు విజయాన్ని సాధించిన ఘనతలు లేవు. కానీ ఈ ఏడాది మాత్రం అద్భుతమైన జుట్టుతో మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 లో ఇప్పటివరకు తెలుగు టైటాన్స్ 13 మ్యాచులు ఆడగా 8 మ్యాచ్ లలో నెగ్గింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలోకి దూసుకు వచ్చింది. అద్భుతంగా రానిస్తున్నటువంటి హర్యానా స్టీలర్స్ పై కూడా తెలుగు టైటాన్స్ నిన్న రాత్రి విజయాన్ని సాధించింది. దీంతో ఈ ఏడాది తెలుగు టైటాన్స్ కు తిరుగు లేదని… పక్కాగా ఈసారి కప్పు కొడుతుందని ఫ్యాన్స్ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఏడాది అయినా కప్పు కొట్టి.. తెలుగు ప్రేక్షకులను అల్లరిస్తారో లేదో అనేది మరి కొద్ది రోజులపాటు వేచి చూడాల్సిందే. మరి మీకు తెలుగు టైటాన్స్ జట్టు ఈ ఏడాది ట్రోఫీ అందుకుంటుందో లేదో కామెంట్ చేయండి.
Read also : పిడుగుపాటుకు పాడి గేదే మృతి
Read also : లిక్కర్ పై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేదే లేదు : సీఎం